మా తెలంగాణతల్లికీ మూక్కోటి దండాలు
ఇదె వందనాలూ
రతనాల వీణకూ నీరాజనాలూ
కాకతీయ తోరణం - కంఠాభరణమై
కళోత్సవాలు - కలిఅందియలై
గోల్కొండ గర్ఛమే - రత్నకోశముగా
తంగేడు, గన్నేరు - పసుపు పారాణీలు
నిత్యమై - సత్యమై - నిలిచియుండే భూమి
ప్రాణహిత, మంజీర, పెనుగంగ, గోదారి,
క్రిష్ణమ్మ ఇటపారు జీవన జలాలు
తాగునీటికి గాని సాగునీటికి గాని
కరువు లేదిచట కొరత చూడగలేదు మొదట
బమ్మెర పోతన్న భాగవత పద్యాలు
కంచెర్ల గోపన్న, దశరథి, కాళోజి
అభ్యుదయ కవితల సాహిత్య కుసుమాలు
వికసించి ప్రసరించు పరిమళాలిచట
రుద్రమ్మ, సమ్మక్క, కొమరం భీమన్న
వీరత్వ, దీరత్వ గాధలె గళమెతి
నీ పాటలె పాడుతాం
నీ ఆటలె పాడుతాం
నీ కోసమే పోరాడుతాం
నీ రాష్ర్ట అవతరణ సాధించి తీరుతాం - సాధించి తీరుతాం
జై తెలంగాణ - జై తెలంగాణ
జై జై తెలంగాణ - జై జై తెలంగాణ
Wednesday, October 15, 2008
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment